కృతి-1
సొంపైన మనస్సుతో ఇంపైన బంగారు గంపలతో మంచి చంపకములను చల్లరే రామచంద్రుని పైని పూల .. 1. పామరములు మాని ప్రేమముతో రామ మనోహరుని పై తామర పూల .. చల్లరే 2. ధాత వినుతుడైన సీతాపతి పైన చేతులార జాజి సంపెంగ పూల .. చల్లరే 3. అమిత పరాక్రమ ద్యుమణీ కులార్ణవ విమల చంద్రుని పై హృత్కుముద సుమముల .. చల్లరే 4. ఎన్నరాని జనన మరణము లేకుండ మనసార త్యాగరాజ నుతుని పైని పూల .. చల్లరే
sompaina manassutO impaina bangaaru
gaMpalatO maMci caMpakamulanu
callarE rAmacandruni paini pUla ..
1. pAmaramulu mAni prEmamutO rAma
manOharuni pai tAmara pUla … callarE
2. dhAta vinutuDaina sItA pati paina
cEtulAra jAji saMpenga pUla .. callarE
3. amita parAkrama dyumaNI kulArNava
vimala caMdruni pai hrutkumuda sumamula .. callarE
4. ennarAni janana maraNamu lekuMDa
manasAra tyAgaraja nutuni paini pUla .. callarE